జనంగొంతుకై ప్రశ్నిస్తున్న జనంసాక్షి పత్రిక

 

కడ్తాల్ (జనంసాక్షి)జనసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం తలకొండపల్లి జనంసాక్షి విలేకర్ తూర్పు శ్రీను,కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దమ్మున్న వార్తలతో,నిజాలను నిగ్గు తెలుస్తూ,సత్యశోధన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక జనంసాక్షి అని కొనియాడారు.ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఇలాగే నిరంతరం సమస్యలపై గలమెత్తి ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేందుకు జనంసాక్షి పత్రిక యజమాన్యం పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో చౌదర్ పల్లి ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి,తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవంచ నరసింహారెడ్డి,రాంపూర్ కాకి కృష్ణ,సురేందర్ రెడ్డి,రాజు రెడ్డి,రవి గుప్తా,తిక్కల శివ,తదితరులు పాల్గొన్నారు.