ప్రాణం పోయేంతవరకు ప్రజాసేవనే

 

 

 

 

 

 

కొన్నే గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్

బచ్చన్నపేట జనవరి 10 ( జనం సాక్షి): ప్రాణం పోయేంతవరకు ప్రజాసేవకే నా జీవితం అంకితం అని బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ అన్నారు. శనివారం
మండలం కోన్నే గ్రామానికి చెందిన గునుగంటి భాగ్యలక్ష్మి(38) అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనో ధైర్యం చెప్పి 5000 ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అధికారం వచ్చిన పేద ప్రజలను మర్చిపోకుండా అక్కున చేర్చుకుంటున్న సర్పంచ్ ని గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చల్ల కమలాకర్. చెవుల నరసయ్య. బాలరాజు. గునుగంటి అశోక్. చెవుల కుమారస్వామి. జవ్వాది నరసింహులు. చల్ల రవి. చల్ల నవీన్.కొర్వి శంకర్ తదితరులు పాల్గొన్నారు