షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

share on facebook

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ అధానా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్‌ 1 విభాగంలో 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున పాల్గొన్న మరో షూటర్‌ మనీశ్‌ అగర్వాల్ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో చైనా క్రీడాకారుడు డిఫెడింగ్ ఛాంపియన్‌ చావో యాంగ్‌ (237.9 ‌) పారాలింపిక్ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించగా, మరో చైనా క్రీడాకారుడు హువాంగ్ జింగ్‌ (237.5) రజతం అందుకున్నాడు.

షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన సింగ్‌రాజ్‌ అధానాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

Other News

Comments are closed.