2018 నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు

` తప్పని నిరూపించండి
` కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్
` కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తాం
` ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తా
` ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి ప్రకటన
(2029లో జమిలి ఎన్నికలు..
తెలంగాణలోనూ అప్పుడే: సీఎం రేవంత్‌రెడ్డి)
న్యూఢిల్లీ(జనంసాక్షి):2018లో తెచ్చిన నిబంధనల మేరకే సింగరేణిలో టెండర్లు. సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో పెడతాం. ఆరోపణలు తప్పని తేలితే కిషన్‌రెడ్డి క్షమాపణలు చెబుతారా? సింగరేణి సంస్థ అప్పులు మా హయాంలో పెరగలేదు. సింగరేణికి కేసీఆర్ పెట్టిన బకాయిలే ఎక్కువ. సింగరేణి విషయంలో కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు” అని అన్నారు. దిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన విÖడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన వెల్లడించారు. నూటికి నూరు శాతం తన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదని స్పష్టం చేశారు. దిల్లీలో విÖడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వచ్చిందని, హైదరాబాద్ నగరాన్ని బుల్లెట్ ట్రైన్‌హబ్‌గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి ఇచ్చామన్నారు. ఫ్యూచర్‌సిటీ, ఎయిర్‌పోర్టునకు సవిÖపంలో 500`700 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించారు. అవిÖర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టితీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తానని తెలిపారు.2018లో తెచ్చిన నిబంధనల ప్రకారమే సింగరేణిలో టెండర్లు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో పెడతానన్నారు. ఆరోపణలు తప్పని తేలితే కిషన్‌రెడ్డి క్షమాపణలు చెబుతారా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సింగరేణి సంస్థ అప్పులు తమ హయాంలో పెరగలేదన్నారు. కేసీఆర్ పెట్టిన బకాయిలే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. సింగరేణి విషయంలో కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మొత్తగా ఉన్నానని తనను మాత్రమే ఆయన ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి : తన ప్రభుత్వంలో నూటికి నూరుశాతం ఫోన్‌ట్యాపింగ్ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకుంటానని ఆయన తెలిపారు. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం తనకు అవసరం లేదని వివరించారు. ఎసఐబీ ఫిర్యాదుతోనే కేసు దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ఎసఐబీలో పరికరాల మాయంతోనే కేసు బయటపడిందన్నారు. కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీబీఐకి ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు లేరని రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖరాసి 6 నెలవుతుందని, కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం కేసును త్వరలోనే సీబీఐకి ఇస్తామని ఆయన వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి
` గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి
` రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
` కేంద్ర నిధులతో కష్ణా`వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి
` రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
` హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం
` అంతర్జాతీయ ప్రమాణాలతో మమూనురు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలి
` పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
` 18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి
` యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి
` బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండి
` 2014`15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి
` కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతి
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఈసా… మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్నగాంధీ సరోవర్ ప్రాజె క్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. సుస్థిర పట్టణాభివద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఈసా… మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం తెలియజేశారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివద్ధి, నిరాడంబర జీవనశైలిని అద్దం పట్టేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రపంచస్థాయి విద్యా, సాంస్కతిక, ఆధ్యాత్మక, పర్యావరణ కేంద్రంగా నిలుపుతామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కు ఫిబ్రవరి నెలాఖరులో చేసే శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాసరాజు, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
కేంద్ర నిధులతో కష్ణా`వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి
కష్ణా`వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తాన్ని తామే భరిస్తామని ఇప్పటికే తెలియజేసిన విషయాన్ని సీఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సవిÖపంలో కష్ణా ప్రాంతం ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. హైదరాబాద్`చెన్నై (778 కి.విÖ.), హైదరాబాద్`బెంగళూర్ (586 కి.విÖ.), హైదరాబాద్`పుణే (556 కి.విÖ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సవిÖపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సీఎం సూచించారు. హైదరాబాద్`చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి విÖదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని వివరించారు. హైదరాబాద్`బెంగళూరు, హైదరాబాద్`పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని సీఎం రైల్వే మంత్రికి వివరించారు. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని రైల్వే శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తామని హావిÖ ఇచ్చారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మమూనురు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలి
తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు సవిÖపంలో నిర్మించనున్న మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్.. ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివద్ధి చెందుతోందని, వరంగల్‌కు దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క`సారలమ్మ జాతర మేడారంలో జరుగుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. మామూనూరు నుంచి సాధ్యమైనంత త్వరగా విమాన రాకపోకలు సాగేలా పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. వెంటనే అనుమతుల మంజూరు చేయాలని కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హావిÖ ఇచ్చారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి
వానాకాలం పంటకు (2025`26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కలిశారు. వానా కాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎలఎంటీ) అనుమతించారని.. కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో అదనంగా 18 ఎలఎంటీలు తాము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్ సీఐ సేకరించాలని కేంద్ర మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. 2024`25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. 2024`25 వానా కాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారని, దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014`15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం, రాష్ట్ర మంత్రి కోరారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేకరణకు తాము రుణం తీసుకున్నామని.. దానికి వడ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.



