అభివృద్దే లక్ష్యంగా… అల్లిపూర్ గ్రామ సభ

సర్పంచ్ ఎంభారి గౌతమి వెంకటేష్..
జనం సాక్షి రాయికల్:రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం రోజున గ్రామ సర్పంచి ఎంబారి గౌతమి వెంకటేష్, ఉప సర్పంచ్ గురులింగం మఠం వినయ్, పంచాయతీ కార్యదర్శి శేఖర్, గ్రామ వార్డు సభ్యులు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల, పరిష్కారమే లక్ష్యంగా ఈ సభను నిర్వహించగా, గ్రామానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ,త్రాగునీరు సరఫరా, వీధి దీపాలు సంరక్షణ, డ్రైనేజ్ సమస్యలు, తదితర అంశాలపై గ్రామస్తులు తమ సమస్యలను, సూచనలను సభలో వెల్లడించారు. గ్రామస్తులు అభిప్రాయాలను సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు శ్రద్ధగా విని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌతమి వెంకటేష్, మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను గురించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
గ్రామాభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు.
గ్రామ సభలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు గ్రామ ప్రజలు,వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శేఖర్, మాజీ సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మోఖిద్, మాజీ ఉపసర్పంచి సాగర్ రావు, కారాబార్ రాజేందర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ఆశ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


