పురపోరు.. రిజల్డ్‌డే…
` నేడే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
` అధికారులకు ఈసీ దిశానిర్దేశం
` ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ
` ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం
` లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియపై అధికారులకు ఈసీ దిశానిర్దేశం
న్యూఢిల్లీ(జనంసాక్షి):మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తత ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు శుక్రవారం వెల్లడి కానుంది. ఉదయం 8 గంటల 123 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీల్లో 28 లక్షల 4వేల 274 ఓట్లు 7 కార్పొరేషన్లలో లక్ష 5 వేల 132 ఓట్లు లెక్కించాల్సి ఉంది. స్టాంగ్ రూముల్లో 16 వేల 31 బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల వెల్లడికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులకి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్ కేంద్రం వారీగా 25 బ్యాలెట్ పత్రాలని ఒక బండిల్‌గా చేసి లెక్కింపు చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్‌కు 40 కట్టలు అంటే వెయ్యి ఓట్లను కౌంటింగ్ టేబుల్‌కు పంపిస్తారు. ఓట్లను ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల వారీగా ట్రేలో వేస్తారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్లను 100 చొప్పున బండిల్ చేస్తారు. రౌండ్లు, టేబుళ్ల వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాలు నమోదు చేసి చివరకి ఫలితాలు ప్రకటించనున్నారు.ఓట్ల లెక్కింపు కోసం సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లని రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని ఎస్?ఈసీ స్పష్టంచేసింది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్టానిక్ వస్తులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎస్?ఈసీ, డీజీపీ, కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు.నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాలు, నగరాలన్నీ కలిపి 73.01 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88, కార్పొరేషన్లలో 66.05 శాతం మంది ఓట్లు వేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం, అతి తక్కువగా నందికొండలో 59.68 శాతం పోలింగ్ నమోదైంది. చౌటుప్పల్‌తో పాటు చండూరు, జిన్నారం, పోచంపల్లి మున్సిపాలిటీల్లో 90 శాతానికిపైగా ఓటర్లు ఓటు వేశారు.46 మున్సిపాలిటీల్లో 80 శాతం, 51 మున్సిపాలిటీల్లో 70 శాతం, 15 మున్సిపాలిటీల్లో 60 శాతం దాటింది. రెండు కార్పొరేషన్లలో పోలింగ్ 70 శాతానికి పైగా, నాలుగింటిలో 60 శాతానికి పైగా నమోదైంది. కార్పొరేషన్లలో నల్గొండలో 77.36 శాతం, కొత్తగూడంలో 74.52, రామగుండంలో 69.32, మహబూబ్‌నగర్‌లో 67.73, మంచిర్యాలలో 64.90, కరీంనగర్‌లో 62.98, నిజామాబాద్‌లో 59.12 శాతం పోలింగ్ జరిగింది. పట్టణాలు, నగరాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటింగ్?లో పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటిలో కలిపి పురుషులు 72.63 శాతం ఓట్లేయగా, మహిళలు 73.39 శాతం మంది ఓటు వేశారు.
ఎసఈసీ రాణికుముదిని దిశానిర్దేశం : రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లోని 2 వేల 582 వార్డుల్లో 13 లక్షల 61 వేల 285 మంది పురుషులు, 14 లక్షల 42 వేల 751 మంది మహిళలు, 238 మంది ట్రాన్స్‌జెండర్లు ఓట్లు వేశారు. ఏడు కార్పొరేషన్లలో 4 లక్షల 90 వేల 544 మంది పురుషులు, 5 లక్షల 14 వేల 475 మంది మహిళలు, 113 మంది ట్రాన్స్‌జెండర్లు ఓట్లు వేశారు. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎసఈసీ రాణికుముదిని, సీడీఎంఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవి నిరంతరం పర్యవేక్షించి, క్షేత్రస్థాయిలో అవసరమైన విషయాలను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు.



