సంప్రదాయ పండుగలకు పెద్దపీట
మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహారెడ్డి
మిర్యాలగూడ,జనం సాక్షి తెలంగాణ రాష్ట్రంలో సంప్రద పండుగలకు తెరాస అత్యంత ప్రాధాన్యత యిస్తుందని మాజీ ఎమ్మెల్యే, జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. గురువారం బతుకమ్మ పండుగ సంబరాలలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమం లో అయన ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పేరుగాంచాయని అన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల లో ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి,, ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మిల తో బాటు ఆయా గ్రామ సర్పంచ్ లు,ఎం పి టీ సీ లు పాల్గొన్నారు.. చీరల పంపిణి బాదలాపురం, అవంతిపురం, ఆలగడప,
జాలుబాయి తండ, రాయిని పాలెం, ముల్కలకాల్వ, కొత్త గూడెం, లక్ష్మి పురం, రుద్రారం, కిష్టాపురం, గూడూరు గ్రామం, బొట్య నాయక్ తండ గ్రామాలలో నిర్వహించారు.
Attachments area