అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం

పోలీస్ అదుపులో నిందితుడు.
పెద్దపల్లి ఆగస్ట్ 25(జనం సాక్షి): అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలను టాస్క్‌ఫోర్స్, పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి శ్రీనివాసులు నేతృత్వం లో పెద్దపల్లి జోన్ పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీకు *కాసులపల్లి గ్రామంలో నిహకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ లో యూరియా బస్తులను* అక్రమంగా డంప్ చేసి నిల్వ ఉంచినట్లు నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ టీమ్ కి వచ్చిన నమ్మదగిన సమాచారం టాస్క్‌ఫోర్స్ ఎస్ ఐ దీకొండ రమేష్, లక్ష్మణ్ రావు, పెద్దపల్లి రూరల్ ఎస్ ఐ మధుకర్ ఆధ్వర్యంలో, పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కలిసి పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అడెపు సంపత్ (43), అను అతడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 600 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బస్తా బరువు 50 కిలోలు కాగా, ఒక్కో బస్తా విలువ రూ.600 చొప్పున మొత్తం స్వాధీనం చేసుకున్న యూరియా విలువ రూ.3,60,000గా ఉంటుంది. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అదుపులోకి తీసుకున్న వ్యక్తి, స్వాధీనం చేసుకున్న యూరియా బస్తాలను పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించదమైనది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.



