సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్
సంగారెడ్డి, ఆగస్టు 31 (జనంసాక్షి) : మునిపల్లి మండలం బుదేరాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. శైలజను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాల నిర్వహణలో లోపాలు, పరిపాలనా నిర్లక్ష్యం, విద్యార్థినుల పట్ల సక్రమంగా వ్యవహరించకపోవడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు కళాశాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించారు. నివేదికను పరిశీలించిన అనంతరం కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ కళాశాలల్లో విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.



