సచివాలయంలో ఇసుక విధానంపై చర్చ
హైదరాబాద్: ఇసుక తవ్వకాలపై విధి విధానాలను రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సచివాలయంలో సమావేశమైంది. గనులశాఖామంత్రి గల్లా అరుణ మీడియాతో మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు తీసుకుని ఇసుక విధానంపై చర్చంచినట్లు వెల్లడించారు. నూతన విధానం ప్రకటించేందుకు ప్రభుత్వం మరికొంత సమయం తీసుకోనున్నట్లు చెప్పారు.



