సదానందకు మద్దతుగా నిలిచిన 50 మంది ఎమ్మెల్యేలు

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సదానందగౌడకు 50 మంది ఎమ్యెల్యేలు మద్దతుగా నిలిచి భాజపా శాసనసభాపక్ష భేటీని బహిష్కరించడంతో రాష్ట్ర రాజకీయాలు మరోమలుపు  తిరిగాయి. దీంతో బీజేఎల్పీ భేటీని వాయిదా వేశారు. సదానందగౌడ స్థానంలో జగదీష్‌శెట్టర్‌ను ఎన్నుకునేందురకు ఈరోజు భాజపా శాసనసభాపక్ష భేటీ జరగాల్సి ఉంది. సదానందకు మద్దతుగా 50 మంది ఎమ్మెల్యేలు సమావేశాన్ని బహిష్కరించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పదవులకు పేర్లు ప్రకటించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. తమ వర్గానికి చెందిన 30 మంది ఎమ్యెల్యేలను  మంత్రివర్గంలో చేరుకోవాలని ఆరోపించారు.