సమైక్యరాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల్లో

తెలంగాణకు అన్యాయం
నీటి వాటా కోసం పోరాడాలి
కేసీఆర్‌తో సమావేశమైన తెలంగాణ’ నీటి ‘నిపుణులు
హౖదరాబాద్‌, జూన్‌ 22 (జనం సాక్షి)
సమైక్య రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, తెలంగాణ ఇంజినీర్లు, నీటి పారుదల రంఘ నిపుణలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ ఇంజినీర్లు, నీటిపారుదల రంగ నిపుణలు భేటీ అయి తెలంగాణలో చేపట్టిన నీటి ప్రాజెక్ట్‌ల అమలు తీరును సమీక్షించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశం నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌లాంటి సమస్యలకు సత్వరమే పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై నివేదిక రూపొందిస్తామని ఆర్‌. విద్యాసాగర్‌రావు చెప్పారు.మరో పక్క కృష్ణ, గోదావరి జలాలకు సంబంధించిన వేరొక నివేదికను కూడా పార్టీ సిద్ధం చేస్తుందన్నారు. ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సాగునీటి అధికారులు విఫలమవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని చాలా సాగునీటి ప్రాజెక్టులు నత్తన నడకన నడుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రాంత రైతులు పలు సమస్యలకు గురైనప్పటికీ మంత్రివర్గంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భారీ, మధ్యతరహా సాగునీటిశాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి వల్ల తెలంగాణకా జరిగిందేమీ లేదని సమావేశంలో పలువురు విమర్శించారు.ఈ తరహా సమావేశాల్ని ప్రతి నెలా నిర్వహించాలని నిర్ణయించారు.