‘సమైక్య’ పేర తెలంగాణను నిండా ముంచిండ్రు

నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోచుకుపోయిండ్రు
నగార సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కోదండరామ్‌

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణ యువత అన్ని విధాలుగా తీవ్రంగా నష్ట పోతోందని నీళ్ళు , నిధులు , ఉద్యోగాలు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదారిన దోచుకు పోయిండ్రని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మెన్‌ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల కేటాయింపు మొదలు ఉద్యోగాలు, ప్రమోషన్లు, నిధులు కేటాయింపు, అభివృద్ధి తదితర విషయాల్లో తెలంగాణ వివక్షకు గురవుతోందని వక్తలు ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, జీవోల మాయాజాలం పై చర్చించేందుకు తెలంగాణ నగారా సమితి ఆధ్వర్యంలో బుధవారం జూబ్లీ హాలు లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి తెలంగాణ సంఘాలు రాజకీయ పార్టీల ప్రతి నిధులు హాజరయ్యారు. సమైక్యాంధ్రా రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై ఈ సందర్భంగా చర్చించారు. తెలంగాణ విషయంలో గతంలో జారీ చేసిన జీవోలు ఏమీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదని పెద్ద మనుషుల ఒప్పందం, 610 జీవోలను ప్రభుత్వం మర్చి పోయిందని నేతలు అన్నారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో గతం నుంచే వివక్ష కొనసాగుతోందని ఇటీవల ఆ స్వరూపం పూర్తిగా బయట పడిందని నేతలు విమర్శించారు. అన్ని రకాల సౌకర్యాలున్న ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు సీట్లు కేటాయించక పోవడం ప్రభుత్వ పక్ష పాత ధోరణికి నిదర్శనమన్నారు. ఆంధ్రాప్రాంతంలో మెడికల్‌ సీట్లు తీసుకురావటం లో ప్రభుత్వ పెద్దలు చూపుతున్న శ్రద్ద తెలంగాణ ప్రాంతంలో చూపటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీపుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అదనపు మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయం పై ఎందుకు మాట్లాడలం లేదని చెప్పారు. ఎంసిఐకు పంపిన నివేదికల్లో ప్రభుత్వమే ఆంధ్రప్రాంత కాలేజీలకు లబ్ది పోందేల తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆంధ్రాప్రాంతంలో మెడికల్‌ కళాశాల్లో తెలంగాణవిద్యార్ధులకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయటంతో ఆ రెండు రోజులు మంత్రి మురళిని ఢిల్లీకి పంపీ సీఎం హడావిడి చేశారని, దాని వల్ల ఒరిగిందేమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మెడికల్‌ కళాశాల్లో సీట్లు పెంచేది సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసిందని ఆయన చెప్పారు.