సర్పంచ్ కార్యదర్శి గ్రామపంచాయత పరిధిలోని స్మశాన వాటిక బిల్లులను డ్రా చేసి చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7
సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కుమ్మక్కై లక్షల రూపాయలు డ్రా చేసుకుని గ్రామ ఉపసర్పంచ్ ఇబ్బందులకు గురిచేయడంతో గ్రామపంచాయతీ ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేసిన ఉపసర్పంచ్ మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామ ఉపసర్పంచ్ కుర్ర ఓదెలు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఓదెలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మశాన వాటిక నిర్మాణాన్ని ఉపసర్పంచ్ గా తను పనులు పూర్తి చేస్తే గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ పిన్ రెడ్డి వసంత నరసింహారెడ్డి, గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శి కిరణ్, గ్రామ కారోబార్ చిర్ర సంపత్ సుమారు మూడు లక్షల రూపాయల వరకు డ్రా చేసుకొని సొంత ఖర్చులకు వాడుకున్నారని, స్మశాన వాటిక బిల్లుల కోసం జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లగా, స్మశాన వాటిక బిల్లులు సంవత్సరం క్రితమే ప్రభుత్వము విడుదల చేస్తే డ్రా అయినట్లు రికార్డులు అందజేయడంతో, సర్పంచ్ వసంత నరసింహారెడ్డిని పంచాయతీ కార్యదర్శి కిరణ్ ను అడుగగా తమ సొంత ఖర్చులకు వాడుకున్నట్లు తెలిపారని, 5 నెలలు గడిచిన తనకు రావలసిన మూడు లక్షలు ఇవ్వకుండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పనులు చేయకుండా బిల్లులు డ్రా కోసం ఖాళీగా ఉన్న నిధుల మంజూరు పత్రాలను తీసుకువచ్చి సంతకాలు చేయమని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని వడ్ల భద్రయ్య ఇంటి నుండి మాజీ సర్పంచ్ రెడ్డి స్వామి ఇంటి వరకు ఒక్క తట్ట మొరము పోయకుండ సుమారు 2 లక్షల రూపాయలకు పైన ఎంబి చేయించి, చెక్కులను తన వద్దకు తీసుకువచ్చి సంతకాలు పెట్టాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. ఇట్టి విషయమై మండల స్థాయి అధికారులకు తెలియజేసిన తనకు ఎలాంటి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి విచారణ చేసి తనకు తన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఉపసర్పంచ్ ఓదేలు కోరారు