సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఎవరు ఇచ్చారు?

సిబ్బందితో సొంత పనులు చేయిస్తున్న సస్పెండ్ అయిన సర్పంచ్
ఎంపీఓ ఇచ్చారంటున్న
 కార్యదర్శి
కాదు డిపిఓ అనుమతిచ్చాడట అంటున్న ఎంపీఓ
దంతాలపల్లి ఆగస్టు 25 జనం సాక్షి
సస్పెండ్ అయిన సర్పంచ్ కు పనిచేసే అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు వివరాల్లోకి వెళితే మండలంలోని బీరిశెట్టి గూడెం గ్రామ సర్పంచ్ నెహ్రూ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సిబ్బందితో గ్రామ పంచాయతీ భవనం ప్లాస్టరింగ్ చేయడం కోసం ఇసుక పట్టిస్తుండగా అక్కడే ఉండి బాధ్యతరాహిత్యంతో వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా  మండల పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చాడంటూ చెప్పగా సదరు ఎంపీఓ ను వివరణ కోరగా సస్పెండ్ అయిన సర్పంచ్ కు పనిచేసే అధికారం లేదు   నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదంటూనే జిల్లా పంచాయతీ అధికారి అనుమతిచ్చాడంటూ సస్పెండ్ అయిన సర్పంచ్ నెహ్రూ చెప్పాడని వివరించిన  ఎంపీఓ. ఇదిలా ఉండగా సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఇచ్చింది ఎవరు నిజాలు నిగ్గు తేల్చాల్సింది ఉన్నతాధికారులే అంటూ చర్చించుకుంటున్న గ్రామ ప్రజలు.