సస్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ముంపు ప్రాంతాలకు చెక్‌

హైదరాబాద్‌ : ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏడాది పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ముంపు ప్రాంతాలు లేకూండా చేస్తామని పురపాలక శాఖ మంత్రి మహీంధర్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మారుతీ నగర్‌లో కోటి రూపాయల వ్యయంతో వాటర్‌, వర్షపు నీటి పైపులైనును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి దానం నాగేంందర్‌ సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కృష్ణా ఫేజ్‌-3కి నెల రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మహీంధర్‌ రెడ్డి తెలియజేశారు. వర్షం పడిన రాత్రి  మారుతీ నగర్‌ వాసులు భయాంధోళనకు గురియ్యేవారని ఈ నీటి పైపులైను చేపట్టాడం వల్ల వారి సమస్య తీరుతుందని మంత్రి దానం చెప్పారు.