సాంఘిక నాటక పోటీలు

నిజామాబాద్‌ :నిజామాబాద్‌కు చెందిన శ్రీపాద నాటక కళాపరిషత్‌ వ్యవస్థాపకులు శ్రీపాద కుమారశర్మ ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం నుండి 10వ తేదీ వరకు రాజీవ్‌గాంధీ పంచమ జాతీయస్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పొటీలు జరుగుతున్నాయి. మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు  జేసీ హర్షవర్థన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్థాంగాఉన్నారు.ప్రముఖ రంగస్థల నటులు, జానపద కళల పితామహా కర్నాటి లక్ష్మినర్సయ్య, సినీ హాస్యవటులు కొండవలస అక్ష్మణ్‌రావుకు విశిష్ట సత్కారం చేయనున్నారు. రాత్రి 7.30లకు ఉషోదయా ఆర్ట్స్‌ వారి ‘శ్రేయోజీవనం’. రాత్రి 8.30లకు సిరిమువ్వ కల్చరల్‌ హైదరాబాద్‌ ‘లైఫ్‌లైన్‌’ నాటికల ప్రదర్శించనున్నారు.శ్రీపాద ఫణిచక్రవర్తి,భాస్కరకృష్ణ తదితరులు నాటికోత్సవాలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వేదికనుపరిషత్‌ను ముస్తాబు చేశారు.ఈ పోటీల్లో పాల్గొనే రాష్ట్రస్థాయి కళాకారులకు నగరంలోని సింధిభవన్‌లో విడిది, భోజన వసతి ఏర్పాటు చేశారు.