సాక్షరభారత్‌ కేంద్రాలను తెరిచి ఉంచాలి

వినుకొండ, జూలై 31 : సాక్షర భారత్‌ కేంద్రాలను ప్రతిరోజు తెరచి ఉంచాలని మండల ప్రత్యేక అధికారి ఎడిఎ. రవికుమార్‌ అన్నారు. వినుకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపిడిఒ మాణిక్యరావు అధ్యక్షతన సాక్షర భారత్‌ గ్రామ కొఆర్డినేటర్‌ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సమీక్ష సమావేశాలకు గ్రామ కోఆర్డినేటర్‌లు తప్పక హాజరు కావాలని ప్రభుత్వం పంపిణీ కోసం విడుదల చేసిన వస్తువులను సాక్షర భారత్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఒపిఆర్‌డి అబ్దుల్‌, మండల కోఆర్డినేటర్‌ ప్రభాకర్‌, గ్రామ కోఆర్డినేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.