సాగర్‌ ఆయకట్టు.. ప్రశ్నర్థకం?

స్పందించని ప్రజా ప్రతినిధులు, ఆందోళనలో రైతులు
హర్షం వ్యక్తం చేస్తుండగా నిజాంసాగర్‌ రైతులు దిగులుతో క్రుంగి పోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై ఎన్నో రోజులు గడిచిన ప్రాజెక్టులో నీరు లేక బోసిపోయింది. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతాల్లో వర్షం లేక వరద నీరు రాక ఎడారి వాతావరణం తలపిస్తుంది. గత వారం రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షాలతో కేవలం 2 టిఎంసి ల నీరు కూడా నిజాంసాగర్‌లోకి చేరుకోలేదు. అదే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 30 టిఎంసిలకు పైగా నీరు వచ్చి చేరడం గమనార్హం. నిజాసాగర్‌ ప్రాజెక్టు కింద సుమారు లక్షన్నర ఎకరాల్లో పంట కరీఫ్‌లో సాగు చేస్తుంటారు. ఆలస్యపు వర్షాల వల్ల జిల్లాలో ప్రధాన పంటైన వరిని కేవలం 50 వేల ఎకరాలకు కూడా సాగు కాలేదు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు నిర్మించిన గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం కింద రైతులు మరో 50 వేల ఎకరాల్లో ఆయా రకాల పంటలను సాగు చేస్తారు, అయితే ఈ ప్రాజెక్టు ఎత్తిపోతల కింద కరీఫ్‌ పంట ప్రశ్నార్థకంగా మారింది. నిజాంసాగర్‌కు రిజర్వాయర్‌గా నిర్మించిన సింగూరు ప్రాజెక్టులో కూడా నీటిమట్టం పెరగకపోవడం రైతులను, ఇటు ప్రజాప్రతినిధులకు ఆందోళనకు గురి చేస్తుంది. నిజాంసాగర్‌లో నీరు లేని సమయంలో సింగూరు ప్రాజెక్టు ఆపద్బాందవుగా పని చేసిన సంఘటనలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి రాష్ట్ర భారి నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అన్ని జిల్లాల్లో ప్రాజెక్టులోనికి నీరు వస్తుందని ప్రకటిస్తూ, నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి పరిస్థితి దేవునిపై భారం వేసారు. అయితే వర్షాలు కురవని పక్షంలో నిజాంసాగర్‌ ఆయకట్టు రైతుల పరిస్థితి గురించి వారికి ప్రత్యామ్నయ మార్గాల గురించి నేటికి స్పందించకపోవడం దురద్రుష్టకరం. మంత్రితో పాటు జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ఎంపిలు, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, టిఆర్‌ఎస్‌కు చెందిన మరో ముగ్గురు, బిజేపికి చెందిన ఒక్కరు, ఒక ప్రభుత్వ విప్‌ జిల్లా రైతులు ఎదుర్కుంటున్న నీరు, విద్యుత్తు సమస్యపై స్పందించకపోవడం విచారకరం. ప్రతిపక్ష పార్టీలు సైతం కర్షకునికి అండగా నిలబడకపోవడం సోచనీయం. వరుణుడిపై భారం వేసిన రైతులు పంటలు వేసుకోగా పరిస్థితులు బిన్నంగా ఉండడంతో వేసుకున్న పంటలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం ఆశిస్తుంది. సాగర్‌ ఆయకట్టు కింద వేసిన పంటలను కాపాడుకునేందుకు కనీసం విద్యుత్‌పై ఆధారపడి సాగుతున్న పంటలకు 9 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తే పంటలు కాపాడుకోవచ్చని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.