సామాన్యులకు సౌకర్యాలు

ఖమ్మం, జూలై 19 : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు రామయ్య దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా కలిగించడమే తన ధ్యేయంగా పని చేస్తానని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఇక్కడ పని చేసిన అనుభవంతో రామాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఉద్యోగులు బాధ్యతతో సేవాభావంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయానికి సంబంధించి ఖర్చులు తగ్గించి ఆదాయ వనరులు పెంచేందుకు తగిన కృషి చేస్తానన్నారు. పాలకమండలి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆలయంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన ఇతర పనులను పూర్తి చేయడంతో పాటు బంగారు వాకిలి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారిస్తామన్నారు. దీని కోసం ప్రజలతో సహకరించాలని ఆయన కోరారు.