సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19 సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అధికారులు సమస్యను ఇంకా గుర్తించలేదు. మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌, రమకృష్ణాపూర్‌, గోలేటి ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి.