సిక్కింలో వరదల వల్ల కొండచరియలు విరిగిపడగా 21 మంది దుర్మరణం

గ్యాంగ్‌టక్‌: ఉత్తర సిక్కింలోని మారుమూల ప్రాంతాల్లో ఆదివారం మెరుపు వరదలు సంభవించడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 21 మంది మరణించగా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. మరణించిన, గల్లంతైన వారిలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ), సరిహద్దు రహదారుల సంస్థ (బీర్‌వో) సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే కొండ చరియలు విరిగిపడ్డాయని ఉత్తర జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఖంగ్‌షుర్పా చెప్పారు.