సీఎంను కలిసిన పలువురు మంత్రులు

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,పలువురు మంత్రులు కలిశారు.ఆదివారం కావడంతో సీఎం ఉదయం నుండి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.సాయంత్రం మంత్రులు పితాని సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,కొలుసు పార్థసారది,రాంరెడ్డి వెంకటరెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి,రఘవీరారెడ్డిలు సీఎంతో భేటీ అయారు.రేపటితో మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి కావడం తర్వాత నిర్వహించే లాటరీలు వంటి అంశాలను మంత్రి పార్ధసారదితో సీఎం చర్చిచినట్లు తెలిసింది.