సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని హాస్టల్‌లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పినపాక మండలం ఎల్బీరెడ్డిపల్లెలో సీఎం కాన్వాయ్‌ని హాస్టల్‌ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈరోజు ఆయన ప్రయణిస్తోన్న వాహనశ్రేణిని విద్యార్థులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.