సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం
ఢీల్లీ: భారత్, పాకాస్థాన్ జట్ల మధ్య వచ్చే డిసెంబరులో వన్డే సరీస్ నిర్వహించాలని, ఈ సరీస్‌కి భారత్ అతిధ్యమివ్వాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా భారత్ ఇప్పటికే చాలా సరీస్ ఆడుతోందని, ఇంకా కొత్తగా ఈ సిరీస్ కూడా అంగీకరిస్తే జట్టుమీద ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబయి దాడుల విచారణకు పాకిస్థాన్ సహకరించని నేపథ్యంలో క్రికెట్ దౌత్యం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ముంబయివాసిగా ఇది తన అభిప్రాయం అంటూ గవాస్కర్ కుండబద్దలు కొట్టారు.