సులభ్‌ కాంప్లెక్స్‌ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌ : సులభ్‌ కాంప్లెక్స్‌లో తొలగించిన కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలని గ్రెటర్‌ హైదరాబాద్‌ సులభ్‌ కాంప్లెక్స్‌ ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. బషీర్‌బాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించిన విరు యాజమా న్యానికి వ్యతిరెకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఉన్న పెద్ద పెద్ద సులభ్‌లను మున్సిపాలిటీ లకు అంతర్జాతీయ సులభ్‌ సంస్థ కాంట్రాక్ట్‌ ఇవ్వడం జరిగిందని సంఘం నాయకులు తెలిపారు నగరంలో 52 సులభ్‌లు వీరి పరిధిలో ఉన్నప్పటికీ కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇతర రాష్టాలలో కనీస వేతనం 10వేలు ఇస్తుంటే మన రాష్ట్రంలో కెవలం 4వేల రూపాయలు ఇస్తూశ్రమ దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. సులభ్‌ యాజమాన్యం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.