సెప్టెంబర్‌లో పద్య పోటీలు

కడప, జూలై 31 : రాయలసీమ స్థాయిలో సెప్టెంబర్‌ నెలలో రంగస్థల పద్యపోటీలు నిర్వహించనున్నామని రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు. మొదట చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు విడివిడిగా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఒకొక్క జిల్లా నుంచి 10 మందిని ఎంపిక చేస్తామని అన్నారు. అనంతరం వీరందరికీ రాయలసీమ స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. అమర్‌నాథ్‌రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు.