సెప్టెంబర్‌ 30 కవాతుకు కదలిరండి

సీమాంధ్ర సర్కారు పునాదులు కదలాలి
ఆ దెబ్బకు ఢిల్లీ దిగి రావాలి
గ్రామస్థాయిలోనే ఉద్యమ పునాదులు బలోపేతంచేద్దాం
తెలంగాణను డంపింగ్‌ యార్డుగా మార్చే ‘రాంకీ’ ప్రయత్నాలను అడ్డుకుందాం
టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం
నల్గొండ, ఆగస్టు 3, (జనంసాక్షి):
సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయా లని, ఆ దెబ్బకు ఢిల్లీ దిగి రావాలని టీజేఏసీ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాం క్షను గౌరవించని పార్టీలకు ఈ ప్రాంతంలో మనుగడ ఉండబోదని, ఇలాంటి పార్టీలను తెలంగాణ ప్రజలు తరిమికొడతారని ఆయన స్ప ష్టం చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హా జరైన కోదండరాం సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లా డుతూ సెస్టెంబ ర్‌ 30న టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ మా ర్చ్‌’పై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయ న్నారు. గతంలో తెలంగాణవాదులు విజయవంతం చేసిన మిలియ న్‌ మార్చ్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం ఈసారి తెలంగాణ మార్చ్‌పై తీవ్ర ఆలోచనలో పడిందన్నారు. ప్రభుత్వం ఈ మార్చ్‌ను అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణవాదులు మాత్రం మిలియన్‌ మార్చ్‌ మాదిరిగానే తెలంగాణ మార్చ్‌లోనూ పె ద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోదండరాం పిలుపునిచ్చా రు. టీజేఏసీ నాయకులు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూనే ఇక నుంచి గ్రామస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేస్తారని వివరించా రు. గ్రామగ్రామాన టీజేఏసీ నాయ కులు తిరిగి సీమాంధ్ర పాలకుల వల్ల తెలంగాణకు జరిగిన నష్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని వివరించారు. సకల జనుల సమ్మె ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధ న ఉద్యమంలో ప్రజలందరూ కుల, మత, జాతి భేదాల్లేకుండా ఏకతాటి పైకి వచ్చారని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. రాంకీ కంపెనీ నల్గొండ జిల్లాలో తమ కంపెనీ చెత్త పారబోయడానికి డం పింగ్‌ యార్డు ఏర్పాటు చేయా లని చూస్తున్నదని ఆయన ఆరోపిం చారు. కంపెనీ ప్రతినిధులు, వారికి సహకరిస్తున్న ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే మానుకో వాలని, లేకుంటే పరిణామాలు తీవ్రం గా ఉంటాయని హెచ్చరిం చారు. తెలంగాణలో పుట్టిన జానారెడ్డి ప్ర త్యేక రాష్ట్రం కోసం ఉద్యమించకుండా, సీఎం పదవి కోసం ఆశపడుతున్నాడని, అలాంటి ఆలోచనలు జానారెడ్డి మానుకోవాలని హితవు పలికారు. ఒకవేళ అలాంటిదే జరిగితే తెలంగాణ ప్రజల తరుపున తీవ్రంగా ప్రతిఘ టిస్తామన్నారు. తెలంగాణ నాయకులు ఎవ్వరు కూడా పదవులకు ఆశపడకుండా, చిత్తశుద్ధితో ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రత్యక్షంగా మమేకం కావాలని డిమాండ్‌ చేశారు.