సెమీస్‌లో కశ్యప్‌ ఓటమి

జకార్తా : ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ ఓటమి చవిచూశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌, ఇండోనేషియాకు చెందిన  ఆటగాడు సిమోన్‌ సాంతొసో చేతిలో 15-21, 12-21తో ఓడిపోయాడు. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ కశ్యప్‌ 21- 15, 21-14తో ప్రపంచ 16 ర్యాంకర్‌ హాన్స్‌ క్రిస్టియాన్‌ విటింగ్‌హస్‌ (డెన్మార్స్‌)ను, రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ చెన్‌లాంగ్‌ (చైనా)ను కంగుతినిపించిన కశ్యప్‌ సెమీస్‌లో మాత్రం చేతులెత్తేశాడు.