సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
గరిడేపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి): తెలంగాణ ఆచార సాంప్రదాయాలను కట్టు బాట్లను తెలియజేసేదే బతుకమ్మ పండుగ అని సెయింట్ జోసేఫ్ పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవరెంట్ ఫాదర్ జొనేష్ అన్నారు . గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ రెవరెంట్ ఫాదర్ జోనేష్ మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని ఐక్యతకు నిదర్శనమని అన్నారు . సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు . తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు . అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు .ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరింప చేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు అందించారు . ఈ కార్యక్రమంలో రెవరెంట్ ఫాదర్ రమేష్, సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ గ్రేస్, సిస్టర్స్ లెర్లిస్ , సవ్రియామ్మల్ ,ఉపాధ్యాయులు ఉపేంద్రచారీ,వీరస్వామి, నాగరాజు, గురుస్వామి, శివ,మహిళ ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది పేరెంట్స్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.