సోమవారం జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన


బిచ్కుంద మార్చి 10 (జనంసాక్షి)
జుక్కల్ నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన కొరకు సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. శుక్రవారం నాడు పిట్లం మండలకేంద్రంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే భారీ బహిరంగ సభా ప్రాంగణాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇంజనీర్లకు మరియు ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.