హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సీఎం

కర్నూల్‌: హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. కర్నూల్‌ జిల్లా మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ మొదటి దశను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి.