హఫీజ్‌ను యుద్ధనేరస్థుడిగా ప్రకటించాలి : భాజపా
న్యూఢిల్లీ : ముంబయి దాడుల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్‌ను యుద్దనేరస్థుడిగా ప్రకటించాలని భాజపా డిమాండ్ చేసింది. కాశ్మీర్‌పై సయీద్ చేసిన వ్యాఖ్యలను భారత్ పరిగణనలోకి తీసుకొని అతన్ని నేరస్థుడిగా ప్రకటించేందుకు అంతర్జాతీయస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని భాజపా ఎంపీ బల్బీర్‌పుంజ్ కోరారు.