హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

share on facebook

జనగామ,డిసెంబర్‌8 జనం సాక్షి :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు పేదలకు ప్రచారంగా మాత్రమే మిగిలాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రచారార్భాటాలతో సాగుతున్నారని అన్నారు. విద్యార్థులు సమస్యలపై నిలదీస్తే వారిని జైళ్లలో పెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం నిరంకుశ పాలన సాగిస్తున్నారని అన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేయాలని సీపీఎం నేత సూచించారు. బంగారు తెలంగాణ కాదు, బతుకు తెలంగాణ వస్తేనే అందరికీ సామాజిక న్యాయం చేకూరుతుందన్నారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. ఐటీ, పరిశ్రమలు, కారిడార్‌ అంటూ కాలాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ నియామకాలు చేయకుండా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూడకుండా కబుర్లతో కాలక్షేపం చేయడం సరికాదన్నారు.

Other News

Comments are closed.