హెటిరో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

విశాఖపట్నం : నక్కపల్లి హెటిరో ఔషధ కార్మాగారం ప్రమాద ఘటనకు సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హెటిరో పరిశ్రమ వద్ద నిర్వహించిన ధర్నాలో వామపక్ష పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి వామపక్ష నేతలు వినతిపత్రం సమర్పించారు.