హెడ్‌ కానిస్టేబల్‌ శర్మపై కేసు

హైదరాబాద్‌: పోలీసు రవాణా విభాగం ఎస్‌పి లక్ష్మీనారాయణ కిడ్నాప్‌ వ్వవహారంలో హెడ్‌ కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారిని అక్రమంగా నిర్భందించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేయబోమని డీజీపీ దేనేష్‌రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో నామమాత్ర అభియోగాలతో శర్మపై కేసు పెట్టినట్లు సమాచారం.