హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా నగరంలో ్ణొలిగూడ రామమందిరం నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ వరకు చేపట్టిన హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఆద్యంతం హనుమాన్‌ నామస్మరణతో వైభవంగా ఈ యాత్ర జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.