హైదరాబాద్‌ నుంచి పరకాలకు టీఆర్‌ఎస్‌ ర్యాలీ

(జేఏసీ) కన్వీనర్‌ కోదండరాం

(జేఏసీ) కన్వీనర్‌ కోదండరాం

హైదరాబాద్‌ : పరకాల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం నగరంలోని కుషాయిగూడ హెచ్‌బీ కాలనీ నుంచి పరకాల వరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.నగరంలో ఈ ర్యాలీని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) కన్వీనర్‌ కోదండరాం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామగ్రామాన తెలంగాణ అంశంపై ప్రజలకు మరింత వివరించేందుకు ఈ ర్యాలీ ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ అభ్యర్థిగా పోటీలో ఎంత మంది ఉన్నా పరకాలలో గెలిచేది మాత్రం తెలంగాణవాదమేనని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరోసారి ఢిల్లీ నేతలకు తెలియజేయాలని కోదండరాం కోరారు.