అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ బ్యాంకులకు ఆదరణ పెరగుతుంది


ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సు
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోందని, ప్రజల అవసరాలను వ్యాపార కోణం తో చూసే వాణిజ్య బ్యాంకులకు భిన్నంగా సేవాధృక్పదంతో పని చేయడమే దీనికి కారణమని ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్‌ ఎడిటర్‌ జావెద్‌ ఆలీఖాన్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇన్యూరెన్స్‌ సంస్థ తొలిసారిగా ఓ అన్‌లైన్‌ సర్టిఫికైట్‌ కోర్సును హైదరాబాద్‌ లో సియాసత్‌ కార్యాలయంలో ప్రారంభించింది. 6 నెలల వ్యవధి ఉండే కోర్సు ద్వారా ఇంటర్‌ నెట్‌ రియల్‌ టైమ్‌ కోర్సును అభ్యసించవచ్చు ఆర్ధిక సేవారంగంలో ఇప్పటికే కోనసాగుతున్న వారికి, కొత్తగా రావాలి అనుకునే వారికి ఈ కోర్సు ఎంత గానో దోహద పడుతుందని ఇస్లామిక్‌ బ్యాంక్‌ పైనాన్స్‌ ఇన్యూరెన్స్‌ సంస్థ ప్రతినిధులు పేర్కోన్నారు. ఈ కోర్సు మొత్తం ఫీజు 12000/- రూపాయలు కాగా పేద విద్యార్థులకు, ఉలేమాలకు 50 శాతం రాయితీతో, ఎంబీయే ఫైనాన్స్‌ చేసిన వారికి 25 శాతం రాయితీ ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ధులు తెలిపారు.