అంతర్జాల పరిజ్ఞానంతో చేపలు అధిక ఉత్పత్తి పొందవచ్చు.

కూసుమంచి అక్టొబర్ 10(జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం 23రోజుకు చేరీనది.పరిశోదనకేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీ ఎన్.దిలీప్ మత్య్సకారులకు కంప్యూటర్ (అంతర్జాల)ల ఉపయోగం ఆపరిజ్నానం ఉపయోగించి చేపలకు సంబందించి మేలు రకం పిల్లలు,మేత, వ్యాధులు, ఉత్పత్తి, మార్కెట్ వీటి పరిజ్ఞానంతో అధిక ఉత్పత్తి పొందవచ్చు అని చెప్పారు.కేంద్రం శాస్త్రవేత్త శాంతన్న చాపల పెంపకం లకు మట్టి రకాలు నీటిలబ్యత శాంపిల్స్ నుఉపయోగించి అధిక చేపల ఉత్పత్తి చేయవచ్చని సూచించారు.