అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ

రాజన్న సిరిసిల్ల,మే11(జ‌నం సాక్షి ):  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గంభీరావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరికాసేపట్లో రైతుబంధు చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.