అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో త్రాగడానికి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
తోరూర్ 22 ఆగస్టు( జనంసాక్షి ) పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీసం తాగడానికి మంచినీరు లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 204 మంది, అందులో బాలికలు 96, బాలురు 148 మంది పిల్లలు ఉన్నారు. ఈ పాఠశాలలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో మొత్తం ఆరుగురు టీచర్లు మరియు ఇంకొక టీచర్ కూడా ఉంటారు. ఈ పాఠశాలలో మిషన్ భగీరథ నీటి వసతు కలదు నీరు నిల్వ ఉండే ట్యాంక్ శుభ్రపరచకపోవడంతో అందులో తోక పురుగులు చెత్తాచెదారం ఉంటున్నాయి. ప్రాథమిక పాఠశాల పరిధి లోనే ఒక బోరింగ్ కూడా ఉంది ఆ నీరు విపరీతంగా తుప్పు (సిల్లుమ్) వస్తూ ఉంటుంది. నీళ్లు తెచ్చుకొని కొంతమంది పిల్లలు బోరింగ్ నీళ్లను కూడా తాగుతారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల విద్యార్థులు వారి ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న ఆఫ్ లీటర్ లేదా ఒక లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకొని మధ్యాహ్నం భోజన సమయం నుండి సాయంత్రం వరకు తెచ్చుకున్న వాటర్ బాటిల్ నీళ్లనే తాగుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజు త్రాగడానికి సరిపడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాటర్ తెచ్చుకొని విద్యార్థులు తెచ్చుకున్న విద్యార్థులు నీళ్లు అయిపోయిన తర్వాత ఇబ్బందులకు గురి అవుతున్నారు. గతంలో ఈ పాఠశాలకు కొంతమంది దాతలు 5 వాటర్ క్యాన్లు బహుమతిగా ఇచ్చారు. వాటిని ఈ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నిరుపయోగంగా తరగతి గదిలో దాస్తున్నారు. పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పిల్లలను ఇంటి దగ్గర నుండి బాటిళ్లలో వాటర్ తెచ్చుకోమని చెబుతున్నారు. తెచ్చుకున్న నీళ్లు అయిపోయిన పిల్లలు మరియు మంచినీళ్లు తెచ్చుకొని పిల్లలు ప్రాథమిక పాఠశాల కు అందుబాటులో ఉన్న కిరాణం షాప్ లో మంచినీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. తొర్రూర్ అంబేద్కర్ నగర్ లో గల ప్రాథమిక పాఠశాలలో తాగడానికి మంచి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు.