అంబేద్కర్ భవన్ కాలనీలో బొడ్డెమ్మ వేడుకలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాదులోని అంబేద్కర్ భవన్ కాలనీలో ఆదివారం బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడారి కోమల ఆధ్వర్యంలో మహిళలు పిల్లలు బొడ్డెమ్మ పాటలు పాడి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ జ్యోతి మహిళా మండలి వారు భక్తిశ్రద్ధలతో మూడో రోజు బొడ్డెమ్మ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు గడిగె శిరీష, గాలి పూజ, నీలం సుజాత, రామిళ్ళ మమత ,కడారి సరోజన, కడారి సరూప, విజయ, ధనలక్ష్మి, మంజుల, గరిగె చందన, బత్తుల పావని మొదలగు వారు పాల్గొన్నారు
Attachments area