అఖిల భారత ముస్లిం సమ్మేళనానికి సహకరించండి
– సీఎంను కోరిన ప్రతినిధి బృందం
హైదరాబాద్,సెప్టెంబర్21(జనంసాక్షి):
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కలిశారు. అసదుద్దీన్ నేతృత్వంలో సీఎం వద్దకు వెళ్లిన బృందం అఖిల భారతస్థాయి ముస్లింల సమ్మేళనానికి ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ముస్లింల మహాసభకు మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం పరిధిలోని బాలాపూర్‌లో ముస్లింల సమ్మేళనం జరుపుకోనున్నారు. షాహీన్‌నగర్ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 21 నుంచి మూడు రోజులపాటు ఈ ముస్లిం సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు