అగ్నికీలల మారణహోమం
` టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్ బస్సు
` ఘోర దుర్ఘటనంలో 13మంది ప్రయాణికుల మతి
` పలువురికి తీవ్ర గాయాలు
` మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం
` ప్రమాదం ఘటనపై ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబలు, రేవంత్‌లు దిగ్భ్రాంతి
` మతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 వేల పరిహారం ప్రకటించిన ప్రధాని
` మతులు కుటుంబాలకు సంతాపం..
మార్కాపురం(జనంసాక్షి):మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సవిÖపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతో పాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మతదేహాలను వెలికితీశారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సును హరికష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. గురువారం తెల్లవారు జామున ఆరుగంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. ఘటనాస్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ పైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మతిచెందినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. మతుల్లో కనిగిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని మార్కాపురం జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. మతుల వివరాలు.. సీహెచ్ మనోజ్‌కుమార్ (18), వింజమూరు, సీహెచ్ సుజాత (45), వింజమూరు, సీహెచ్ మేఘన (19), వింజమూరు, టి. నరేంద్ర (25), నల్లగొండ్ల, టి. చందన (21), నల్లగొండ్ల, టి. చందు (6), నల్లగొండ్ల , కె. ప్రకాశ్ (17), అయ్యవారిపల్లె, కె.అయ్యన్న (18), (ఎర్రబొట్లప్లలె) వి. గురవయ్య (60), చింతగుంట్ల, కె.అబ్రహం (42), చోడవరం, పి.మహేంద్రరెడ్డి (17), చోడవరం రామచంద్ర ప్రవీణ్ (21), చోడవరం, ఎ.సౌజన్య (22), పెదారికట్ల ఉన్నారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు,ప్రధాని మోడీ, మంత్రులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలోనినిర్మల్ నుంచి నెల్లూరుకు ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
బస్సుప్రమాదంపై చంద్రబాబు దిగ్భాంతి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మంత్రులు అనిత, జనార్థన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సవిÖక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్ వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని సీఎంకు తెలిపారు. ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోయారని, 22 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. హరికష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు జగిత్యాల నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై డైవర్‌ను విచారించగా.. తన వాహనం స్టీరింగ్ స్టక్ అయ్యిందని చెప్పాడని.. దీనిపై నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారని సీఎంకు తెలియజేశారు. బస్సు పూర్తిగా ఆపోజిట్ రూట్‌లో వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని గుంటూరు ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నామని సీఎంకు జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
బస్సు ప్రమాద ఘటనపై రేవంత్ దిగ్భాంతి
మార్కాపురం జిల్లా రాయవరం రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో 13 మంది మతిచెందడం, 20 మందికి తీవ్రగాయాలు కావడంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. నిర్మల్ నుంచి నెల్లూరు వైపు బస్సు వెళుతున్న నేపథ్యంలో మతిచెందిన, గాయపడిన వారి వివరాలను తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని ఆజ్ఞాపించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ సాయిప్రసాద్‌తో ఆయన మాట్లాడారు. ప్రమాదం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ్గªర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మార్కాపురం ప్రమాదంపై ప్రధాని దిగ్భాంతి
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సవిÖపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎనఆరఎఫ్ నుంచి అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం సవిÖపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక బందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.గాయపడిన వారిని వెంటనే సవిÖపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పరిస్థితిని సవిÖక్షిస్తున్నారు.
బస్సు కండిషన్‌పై ముందే హెచ్చరించిన ప్రయాణికులు
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 13 మంది మతదేహాలను వెలికితీశారు. ప్రమాదం నేపథ్యంలో కీలక విషయం వెల్లడైంది. బస్సు కండీషన్‌పై అందులోని ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు. కండీషన్ సరిగా లేదని డైవర్‌తో చెప్పారు. దీంతో బస్సు సిబ్బంది యర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపి మరమ్మతులు చేశారు. అనంతరం బయల్దేరిన కొంత సమయం తర్వాత మార్కాపురం సవిÖపంలోని రాయవరం వద్ద ఈ ఘోరం జరిగిపోయింది. బస్సు డైవర్‌ను అధికారులు విచారిస్తే స్టీరింగ్ స్టక్ర్ అయిందని చెప్పినట్లు తెలిసింది.


