ఎన్యుమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి

అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ

జడ్చర్ల, జూలై 29 (జనంసాక్షి): ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను త్వరగా సమర్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), 75-జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి జె.ఎల్.బి. హరిప్రియ అన్నారు. బుధవారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మరియు 75-జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి జె.ఎల్.బి. హరిప్రియ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జడ్చర్ల, మిడ్జిల్, రాజాపూర్, బాలానగర్, ఊర్కొండ మండలాల తహశీల్దార్లు, ఏఈఆర్వోలు, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల అదనపు తహశీల్దార్, డి.టి, 75-జడ్చర్ల నియోజకవర్గ ఎన్నికల డి.టి. తదితరులు సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన డిజిటలైజేషన్ పనులు 94.35 శాతం పూర్తయినట్లు ఈఆర్ఓ హరిప్రియ సమావేశంలో వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను సమీక్షించి, తగు సూచనలు అందజేశారు. ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను ఎటువంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. గడువు ముగిసే సమయానికి పోర్టల్, మొబైల్ అప్లికేషన్‌లపై రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, చివరి క్షణం వరకు వేచి చూసి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు