అగ్నిపాథ్ పథకాన్ని రద్దు చేయాలి
భారత స్వతంత్ర వజ్రోత్సవలు సందర్భంగా పాదయాత్ర చేసిన
– డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాలోత్ నెహ్రూ నాయక్
– అగ్నిపాథ్ పథకాన్ని రద్దు చేయాలి
కురవి ఆగస్టు -13
(జనం సాక్షి న్యూస్)
ఏఐసీసీ సోనియా గాంధీ పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారత స్వతంత్రం వజ్రోత్సవాల్లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత మాలోత్ నెహ్రూ నాయక్ పాదయాత్ర చేపట్టారు.స్థానిక గాంధీ సెంటర్లో బాపూజీ, ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల లేసి ఘన నివాళులు అర్పించి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం నుంచి గొల్లచర్ల, బలపాల,రాజోలు, మొగిలిచర్ల ,కురవి మండల కేంద్రానికి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాదయాత్రలో ప్రభుత్వ ధరల పెంపుదలకు నిరసనగా ఈ యాత్రను కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలపై భారం మోపుతున్న టిఆర్ఎస్ ,బిజెపి ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తుందని ప్రభుత్వ సంస్థలన్నీటిని ప్రైవేటుపరంగా చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని ఆయన అన్నారు. పాదయాత్రలో ఆయన వెంట గుగులోత్ లాలునాయక్, రాజ్పుత్, బానోత్ దేవ్సింగ్ నాయక్, డిఎస్ జగదీష్ నాయక్,బిక్నా నాయక్,రంగన్న గౌడ్, శీలం శ్రీనివాస్, హరికృష్ణ,అనంతుల ఉపేందర్,బానోతు శ్రీను,శ్యామల శ్రీనివాస్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అనిల్, సోషల్ మీడియా మోహన్,వివిధ మండలాల,గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, కురవి మండల నాయకులు,ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.