అటవీ అధికారుల దౌర్జన్యాలు ఆపాలని పోడు రైతుల ఆందోళన.

–  పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటుతుంటే అడ్డుకున్న బట్టా విజయ గాంధీ…
బూర్గంపహాడ్ జూలై 07(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం
నకిరిపేట గ్రామపంచాయతీ పరిధిలో
పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మొక్కలు నాటుతుంటే పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత బట్టా విజయ్ గాంధీీ అడ్డుకున్నారు. గ్రామ  పంచాయతీ పరిధిలో ఉన్న75 ఎకరాల పోడు వ్యవసాయ భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.దీనికి బగ్గుమన్న నిరుపేద గిరిజనులు… పోడు భూములలో  అటవీ అధికారులు మొక్కలు వేయవద్దని, మాకు ఒక ఎకరా రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని, మా జీవనాధారమైన భూమిని మీరు లాక్కోవద్దని ప్రాధేయపడ్డారు.
గత 20 సంవత్సరాల నుండి ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ఈ పోడు భూములకు పట్టాలి ఇచ్చినప్పటికీ రైతులు ఎన్నో ఏళ్ల నుండి పోడు భూములు చేసుకుని జీవనం సాగిస్తుంటే, ఈరోజు ఆదివాసి గిరిజన భూములను దౌర్జన్యంగా లాక్కొని హరితహారం మొక్కలు వేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు….ఈ కార్యక్రమంలో
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత బట్టా విజయ గాంధీ స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు పూలపెల్లి సుధాకర్ రెడ్డి, ఉసిల్ల భరత్, తాటి సత్యనారాయణ, ముర్రం రాంబాబు, కోర్సా వేంకట్, బొర్రా సత్యనారాయణ, పోడు రైతులు, గ్రామపెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area