చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్

 ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి వంద రోజుల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, ఉండేలా చర్యలు తీసుకున్నారని నటుడు సోనూసూద్ తెలిపారు. ‘సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ సార్ తన విజన్తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. చంద్రబాబును చూసి గర్వపడుతున్నాను. త్వరలోనే ఆయన్ను కలవాలని కోరుకుంటున్నా’నని అన్నారు. ఆంధ్రాను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తనవంతు సాయం అందిస్తానన్నారు.