హైడ్రాకు ఫుల్‌పవర్స్‌

` పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలింపు
` అవసరమైన సిబ్బంది కోసం ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌
` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ
` ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో ఎంపిక
` పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తింపు
` మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు
` వైద్య కళాశాలల్లో 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌
` తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు
` వివరాలు వెల్లడిరచిన మంత్రులు పొంగులేటి,కోమటిరెడ్డి,ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విూడియాకు వెల్లడిరచారు.హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించాం. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం. 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కేటాయింపు ఓఆర్‌ఆర్‌ లోపల 27 అర్బన్‌, లోకల్‌ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్‌ అర్బన్‌లో విలీనం.ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ ఏర్పాటు. ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వరయంలో 12 మందితో కమిటీ. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ.పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తింపు. మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుకు ఆమోదం. 8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం. 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌.ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం.ఏటూరునాగారం ఫైర్‌ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు. కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల, హకీంపేటలో జూనియర్‌ కళాశాల మంజూరు.
హైడ్రా బుల్‌డోజర్లకు పెరిగిన స్పీడ్‌
నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్‌ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కంటోన్మెంట్‌ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్‌కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించు కోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు.  కాగా,  హైదరాబాద్‌ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్‌ కూడా అక్రమ కొట్టడాలపై  చర్యలు ప్రారంభించడం గమనార్హం. ఇదిలావుంటే హుస్సేన్‌ సాగర్‌ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేశారని, జలవిహార్‌ వ్యర్దాలు అన్ని హుస్సేన్‌ సాగర్‌లోకే అంటూ వస్తున్న ఆరోపణలపై జలవిహార్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆదిత్య రాజు స్పందించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. జలవిహార్‌ పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా తమకు 12.5 ఎకరాల స్థలానికి కేటాయించిందని.. అందులోనే వాటర్‌ పార్కును ఏర్పాటు చేశామని వెల్లడిరచారు. తమకు భూమిని కేటాయించిన తర్వాత కోర్టు కేసుతో ఆలస్యంగా 2007 నుంచి యాక్టివిటీ ప్రారంభించామని తెలిపారు. హెచ్‌ఎండీఏ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యకాలపాలు జరుగుతుందని జలవిహార్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు. మా కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లకు కూడా పూర్తి వివరాలు తెలియకపోయి ఉండవచ్చు.. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలన చేసుకోవచ్చు.. హైడ్రా ప్రభుత్వ విభాగం కాబట్టి వారు వచ్చి ఎలాంటి పరిశీలనలు చేసినా మేము పూర్తిగా సహకరిస్తాం.. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హుస్సేన్‌ సాగర్‌లో కలపడం లేదు. సీవేజ్‌ ట్రీట్మెంట్‌ చేసి వాటర్‌ బోర్డ్‌ లైన్‌ లో కలుపుతున్నాం. చెత్తను కూడా సరైన పద్ధతిలో డిస్పోస్‌ చేస్తూ వాటన్నింటికీ ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇక్కడ జరిగిన నిర్మాణాలు కూడా హెచ్‌ఎండీఏ అనుమతుల మేరకు మాత్రమే చేపట్టాం. ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవు అన్ని సక్రమంగా చెల్లిస్తున్నాం. మొదటి దశలో ఐదేళ్లు ఆలస్యం అయిన అంశం మాత్రమే పెండిరగ్లో ఉంది‘ అంటూ జలవిహార్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆదిత్య రాజు స్పష్టం చేశారు. మరోవైపు హుస్సేన్‌ సాగర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన థ్రిల్‌ సిటీ, జలవిహార్‌ పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జలవిహార్‌ను కూల్చి వేయాలంటూ హైడ్రాకు సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా ఫిర్యాదు చేశారు. హుస్సేన్‌సాగర్‌ను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జలవిహార్‌ పై చర్యలు తీసుకోవాలంటు డిమాండ్‌లు భారీగా వినిపిస్తున్నాయి. జలవిహార్‌ ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను హైడ్రా కమిషనర్‌కు సీపీఐ నేతలు అందజేశారు. హుస్సేన్‌ సాగర్‌ ఎఫ్‌టఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో 12.5 ఎకరాల్లో జలవిహార్‌ ఏర్పాటు అయ్యింది. హుస్సేన్‌ సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధి జలవిహార్‌ నిర్మాణాన్ని వ్యతిరికిస్తూ ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌ కోర్టును ఆశ్రయించింది. 2007 లో జలవిహార్‌ ప్రారంభమైంది. జలవిహార్‌కు అప్పటి ప్రభుత్వం 30 ఏళ్ళు లీజ్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జలవిహార్‌లో వాటర్‌ పార్క్‌, ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయి. సందర్శకుల ద్వారా వచ్చే డబ్బులు, ఫంక్షన్‌ హాల్స్‌ ద్వారా కోట్ల రూపాయలను జలవిహార్‌ అర్జిస్తోంది. జలవిహార్‌ వ్యర్దాలు అన్ని హుస్సేన్‌ సాగర్‌లోకే వెళతాయి. ఈ క్రమంలో జలవిహార్‌కు సంబంధించి ఫిర్యాదుల వెల్లువెత్తిన నేపథ్యంగా హైడ్రా తదుపరి టార్గెట్‌గా జలవిహారం నిలిచింది.